Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?
సౌత్ సినిమాలు ఆల్ ఓవర్ ఇండియా తెగ హడావిడి చేస్తున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా రికార్డు కలెక్షన్లతో వరసగా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి.
Bollywood Movies: సౌత్ సినిమాలు ఆల్ ఓవర్ ఇండియా తెగ హడావిడి చేస్తున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా రికార్డు కలెక్షన్లతో వరసగా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి. ఈ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్లు.. సక్సెస్ కి సంతోష పడుతూ సౌత్ ని మెచ్చుకుంటూనే బాలీవుడ్ వాళ్లకి చీవాట్లు పెడుతున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకుని ఎందుకు సౌత్ సినిమాలకు తల వంచుతున్నాం..? మన దగ్గర చేవ లేదా..? మంచి సినిమాలు చెయ్యడం మనవాళ్లకు చేతకాదా అంటూ హీరోల దగ్గరనుంచి డైరెక్టర్లవరకూ మీడియా సాక్షిగా బాగానే దులిపేస్తున్నారు.
పుష్ప దగ్గరనుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 వరకూ ఈ సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ బాక్సాఫీస్ బెండు తీసిన సినిమాలే. దాంతో ఒక్కసారిగా ఆలోచినలో పడింది బాలీవుడ్. ఇన్ని వందల కోట్లు, స్టార్ కాస్ట్ తో ఎన్ని సినిమాలు చేసినా అసలు మినిమం హిట్ కొట్టడం కష్టమైపోతోంది. కానీ సౌత్ సినిమాలు మాత్ర వరసగా బ్లాక్ బస్టర్ హిట్లు అవడంతో సౌత్ సినిమా మేకింగ్ ని పొగుడుతూనే.. సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ ని తిట్టిపోస్తున్నారు బాలీవుడ్ స్టార్లు. సల్మాన్ ఖాన్ దగ్గరనుంచి సంజయ్ దత్ వరకూ వరసగా అందరూ సౌత్ నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ఓపెన్ గానే బాలీవుడ్ కి చురకలు పెడుతున్నారు.