న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ మరికొద్ది గంటల్లో వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు నాని రెడీ అవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రానున్న హిట్-3 ఇప్పటికే లాభాల బాట పట్టినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే చిత్ర ప్రొడక్షన్ ఖర్చు వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇక థియేటర్స్ నుంచి వచ్చేది మొత్తం లాభమే అవుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. హిట్-3 కి ముందు నాని ప్రొడ్యూస్ చేసిన ‘కోర్ట్’ విషయంలో ఇదే జరిగింది.
ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో నాని జాక్‌పాట్ కొట్టి తన పవర్ ఏమిటో బాక్సాఫీస్‌కు చూపెడుతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. ఇక శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్-3 చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Tnews
The way you seamlessly blend statistical insights with compelling storytelling creates an immersive and captivating reading experience. Whether it\'s the latest match updates, behind-the-scenes glimpses.