Shopping cart

Subtotal $0.00

View cartCheckout

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

TnewsTnews
  • Home
  • Entertainment
  • ‘హిట్-3’తో నాగార్జున లింక్..?
Entertainment

‘హిట్-3’తో నాగార్జున లింక్..?

Email :41757

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్-3’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర గ్యారెంటీ హిట్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమాతో మరో స్టార్ హీరోకు లింక్ ఉందనే వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా హిట్-3 కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడట. అయితే, ఈ సినిమా హిట్ కావాలని ఆయన కూడా కోరుతున్నాడట. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ చిత్ర దర్శకుడు శైలేష్ కొలను తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అక్కినేని నాగార్జునకు ఓ కథ వినిపించాడట. అది నచ్చిన నాగ్, హిట్-3 మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో దాన్నిబట్టి తన నిర్ణయం తెలుపనున్నాడు.

ఇక హిట్-3 పై నాని కూడా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో నాగ్ శైలేష్‌కు ఓకే చెప్పడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా నాగ్ శైలేష్‌తో సినిమా చేస్తాడా లేడా అనేది వేచి చూడలి.

Comment (1)

  • August 31, 2023

    Tnews

    Whether it\'s breaking news, expert opinions, or inspiring athlete profiles, your blog delivers a winning combination of excitement and information that keeps.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts