టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్-3’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర గ్యారెంటీ హిట్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమాతో మరో స్టార్ హీరోకు లింక్ ఉందనే వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా హిట్-3 కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడట. అయితే, ఈ సినిమా హిట్ కావాలని ఆయన కూడా కోరుతున్నాడట. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ చిత్ర దర్శకుడు శైలేష్ కొలను తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అక్కినేని నాగార్జునకు ఓ కథ వినిపించాడట. అది నచ్చిన నాగ్, హిట్-3 మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో దాన్నిబట్టి తన నిర్ణయం తెలుపనున్నాడు.
ఇక హిట్-3 పై నాని కూడా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో నాగ్ శైలేష్‌కు ఓకే చెప్పడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా నాగ్ శైలేష్‌తో సినిమా చేస్తాడా లేడా అనేది వేచి చూడలి.
Tnews
Whether it\'s breaking news, expert opinions, or inspiring athlete profiles, your blog delivers a winning combination of excitement and information that keeps.